కేరళలోని కొల్లం జిల్లాలో 40 ఏళ్లుగా పరారీలో ఉన్న హత్య కేసు నిందితుడు మోహనన్ పిళ్లై (65)ను పోలీసులు అరెస్టు చేశారు. 1987 జనవరి 11న జరిగిన ఈ ఘటనలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మోహనన్ తన బావ చంద్రశేఖరన్ పిళ్లైతో గొడవపడి దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం అతను పరారై అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
పోలీసుల సమాచారం ప్రకారం, మోహనన్ పిళ్లై ఆ తర్వాత ఓ మహిళను వివాహం చేసుకుని కుటుంబంతో కలిసి జీవించాడు. వారికి పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొట్టాయం జిల్లాలో మారుపేరుతో నివసిస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు.
ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా అతను స్థానిక వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లినప్పుడు, కొల్లం జిల్లాకు చెందిన తన పాత మిత్రుడు అక్కడ కనిపించాడు. క్షేమ సమాచారాలు తెలుసుకునే క్రమంలో అతని ప్రస్తుత వివరాలు బయటపడ్డాయి. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ హత్య కేసును తిరిగి తెరపైకి తీసుకొచ్చిన ఈ అరెస్ట్‌తో కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించినట్లు పోలీసులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















