రైలు పట్టాలపై నిలబడి ఎదురుగా వస్తున్న రైలును వీడియో కాల్‌లో భార్యకు చూపిస్తూ రాజేశ్ నాయక్ (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజేశ్ నాయక్.. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరిగా పని చేస్తున్నారు. కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో భార్య, తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజేశ్ ఆదివారం రాత్రి భార్యతో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. రైలు పట్టాల మీద నిలబడి భార్యకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. కాగా, రాజేశ్ తనను బెదిరిస్తున్నాడని ఆమె ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. తల్లిదండ్రులు రాత్రంతా అతడి కోసం వెతికారు. ఇవాళ ఉదయం రైలు పట్టాలపై ఎవరో మృతి చెందినట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. రాజేశ్ మృతదేహంగా తేలింది. మృతుడికి కుమారుడు ఉన్నాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















