రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా దేవాదాయశాఖ పరిధిలోని ప్రధాన, ముఖ్య ఆలయాలకు గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. 21 ప్రధాన ఆలయాల్లో దర్శనాలు, ఆర్జిత సేవలు, ఇతర టిక్కెట్లను భక్తులు ‘మనమిత్ర’ యాప్ ద్వారా బుక్ చేసుకోవడం గణనీయంగా పెరగడంతో, మొత్తం రూ.22.26 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
గత నెల 11వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు మాత్రమే రూ.12.91 కోట్ల రాబడి నమోదు అయినట్లు సమాచారం. టిక్కెట్ల బుకింగ్‌తో పాటు భక్తులు ఈ-హుండీ కానుకలను కూడా ఈ యాప్ ద్వారా సమర్పిస్తుండటం వల్ల ఆదాయం మరింత పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
అత్యధిక ఆదాయం శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయానికి నమోదైంది. నెల రోజుల్లోనే ఆ ఆలయానికి రూ.3.39 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత అన్నవరం ఆలయానికి రూ.2 కోట్లు, శ్రీశైల మల్లన్న ఆలయానికి రూ.1.77 కోట్లు, ద్వారకా తిరుమల ఆలయానికి రూ.1.54 కోట్లు, విజయవాడ దుర్గమ్మ ఆలయానికి రూ.1.53 కోట్లు, సింహాచలం దేవాలయానికి రూ.1.04 కోట్లు, వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.66.11 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
డిజిటల్ గవర్నెన్స్ ద్వారా ఆలయ సేవలు సులభతరం కావడంతో పాటు, పారదర్శకత పెరిగి భక్తుల సంఖ్య కూడా పెరుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















