మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు (55) ఎలియాస్ సోమన్న ఎలియాస్ సూరన్న ఏపీ పోలీసులు ఎదురెదురుగా లొంగి surrender అయ్యారు. ఆయనతో పాటు ఏవోబీ స్పెషల్ జోనల్, డివిజినల్, ఏరియా కమిటీలకు చెందిన పలువురు మావోయిస్టులు కూడా surrender అయ్యారు.
ఈ వివరాలను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సోమవారం అధికారికంగా వెల్లడించనున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరి నారాయణరావు దాదాపు 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. 1989–90 మధ్య అప్పటి పీపుల్స్ వార్‌లో చేరి, అంచెలంచెలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగారు.
మిలిటరీ ఆపరేషన్స్‌లో దిట్టగా పేరొందిన చెల్లూరి, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీలో ముఖ్య పాత్ర వహిస్తూ ఆ ప్రాంతంలో పార్టీ పెరుగుదలకు బాధ్యతలు నిర్వహించారు. గతేడాది జూన్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన encounterలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి సహా కీలక నాయకురాలు అరుణ మరియు మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత చెల్లూరి ఈ బాధ్యతలు చేపట్టారు.
చెల్లూరి నారాయణరావు పై ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నట్లు, ఇరు రాష్ట్రాల్లో భారీ నగదు రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన surrender తో మావోయిస్టు పార్టీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలక నేత ఒకరిద్దరినికాకుండా మరెవరు లేకపోయారని, ఏవోబీలో కూడా పార్టీ పూర్తిగా దెబ్బతిన్నట్టుగా పోలీసు వర్గాలు పేర్కొన్నారు.చెల్లూరి శ్రీకాకుళం జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉద్దానం ప్రాంతం నుంచి వచ్చారు. గతంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా, సీఆర్‌సీ మూడో కంపెనీ కమాండర్‌గా వ్యవహరించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketFans CricketNews Crime CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















