నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నదులు ఊహించని స్థాయిలో ఉప్పొంగడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. హైడ్రలాజికల్ పరిశీలనల ప్రకారం గల్చి ప్రాంతంలో త్రిశూలి నదిలో కేవలం 30 నిమిషాల్లోనే నీటిమట్టం ఏకంగా 9 మీటర్లు పెరిగింది. మలేఖు వద్ద కూడా ఇదే సమయంలో సుమారు 7 మీటర్ల మేర నీరు పెరిగినట్లు నమోదైంది.
ఈ స్థాయిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడం సాధారణ వర్షపాతం కారణంగా జరిగే వరదలా కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. హిమాలయ ప్రాంతంలో మంచు, రాళ్లతో కూడిన భారీ చరియలు లెండే ఖోలా ప్రాంతంలో నదిలోకి దూసుకురావడం ఈ విపత్తుకు కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. దాంతో భోటే కోషి నదిలో ఆకస్మికంగా వరద ప్రవాహం పెరిగి, ఆ నీరు త్రిశూలి నదిలోకి దూసుకెళ్లినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి.
ఈ వరదల ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. నదికి అడ్డంగా మంచు, మట్టి, రాళ్లు తాత్కాలికంగా పేరుకుపోయి నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నట్లయితే.. ఆ వెనుక భారీగా నీరు నిల్వై, అడ్డంకి ఒక్కసారిగా తొలగినప్పుడు మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు.
ఈశా ఫౌండేషన్ బృందంలో 77 మంది గల్లంతు :
ఈ విపత్తులో Isha Foundationకు చెందిన కైలాశ్ మానస సరోవర్ యాత్రికుల బృందంలోని 77 మంది ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తిరుగు ప్రయాణంలో గ్యిరాంగ్ ప్రాంతంలోని ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న సమయంలో వరదలు సంభవించాయని సంస్థ తెలిపింది.
తాజా వివరాల ప్రకారం ఈ 77 మందిలో 53 మంది భారత సంతతికి చెందినవారు ఉన్నారని ఈశా సేక్రెడ్ వాక్స్ సమన్వయకర్త వెల్లడించారు. ఈ బృందంలో 19 దేశాలకు చెందినవారు ఉండగా, 50 మందికి పైగా మహిళలు ఉన్నట్లు తెలిపారు.విస్తృతంగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగంగా అధికారులు గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















