ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న “డాక్టర్ టెరర్ మాడ్యూల్” సభ్యులు లఖ్‌నవూలో ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్ర పన్నినట్లు వెల్లడించింది.
డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షహీన్ సయీద్‌లు 2024 ఆగస్టులో ఫ్యామిలీ ట్రిప్ ముసుగులో లఖ్‌నవూ వెళ్లి రెక్కీ నిర్వహించినట్లు NIA తెలిపింది. ఈ పర్యటనను వ్యక్తిగత ప్రయాణంగా చూపించినప్పటికీ, అది భవిష్యత్ ఉగ్రదాడుల ప్రణాళికలో భాగమని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
ఆ సమయంలో వారు విధాన సభ రోడ్ పరిసరాల్లోని ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని, భద్రతా ఏర్పాట్లు, ప్రజల కదలికలు, రూట్‌లను కాలినడకన పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. స్థానికంగా బంధువుల ఇళ్లలో బస చేసి, ఆ ప్రాంతాన్ని స్థావరంగా ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం TATP తయారీకి అవసరమైన రసాయనాలపై ఆన్‌లైన్‌లో వెతికినట్లు కూడా దర్యాప్తులో తేలిందని NIA పేర్కొంది. వీరు సేకరించిన సమాచారం, మొబైల్ లొకేషన్ డేటా కూడా కుట్రను బలపరిచే ఆధారాలుగా ఉన్నాయని వెల్లడించింది.2025 నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనకు ముందే ఈ రెక్కీ జరిగినట్లు తాజా ఛార్జిషీట్‌లో స్పష్టమైంది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థ తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















