సాధారణంగా ఒక అప్లికేషన్ లేదా సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే పైథాన్, జావాస్క్రిప్ట్ వంటి కష్టమైన కంప్యూటర్ భాషలు నేర్చుకోవాలి. కానీ ‘వైబ్ కోడింగ్’ ఈ పద్ధతిని పూర్తిగా మార్చేస్తోంది. మీరు ఏఐ (AI) కి మీకు ఎలాంటి సాఫ్ట్‌వేర్ కావాలో మీ సొంత భాషలో (Natural Language) వివరిస్తే చాలు, అది వెంటనే దానికి కావాల్సిన కోడ్‌ను రాసి ఇచ్చేస్తుంది. అంటే, మీరు కోడర్ అవ్వక్కర్లేదు, కేవలం మీ ఐడియాని ‘వైబ్’ (భావం) రూపంలో చెబితే సాఫ్ట్‌వేర్ సిద్ధమైపోతుంది.
ఆండ్రెజ్ కర్పతీ ఇచ్చిన పేరు: ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకులు ఆండ్రెజ్ కర్పతీ గత ఏడాది ఫిబ్రవరిలో ఈ విధానానికి ‘వైబ్ కోడింగ్’ అని పేరు పెట్టారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) అత్యంత తెలివైనవిగా మారుతున్న తరుణంలో, భవిష్యత్తులో అసలు కోడ్ అనేదే కంటికి కనిపించకుండా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ జరుగుతుందని ఆయన అంచనా వేశారు.
ఎలా పని చేస్తుంది? ఇది పూర్తిగా ఏఐ ఆధారిత టూల్స్ ద్వారా పనిచేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కర్సర్ (Cursor), కోపైలట్ (Copilot), రిప్లిట్ (Replit), కోడ్-విస్పర్ వంటి ప్లాట్‌ఫామ్స్ వైబ్ కోడింగ్‌కు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఇందులో యూజర్లు ఇచ్చే ‘ప్రాంప్ట్’ (Prompt) చాలా కీలకం. మీరు ఎంత స్పష్టంగా మీ అవసరాన్ని వివరిస్తారో, ఏఐ అంత ఖచ్చితమైన అవుట్‌పుట్‌ను ఇస్తుంది.
ప్రయోజనాలు:
- వేగం: నెలల తరబడి పట్టే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇప్పుడు గంటల్లోనే పూర్తవుతుంది.
- అందరికీ అందుబాటులో: టెక్నాలజీ నేపథ్యం లేని వారు కూడా తమ సొంత యాప్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
- తక్కువ ఖర్చు: చిన్న కంపెనీలు భారీగా డెవలపర్లను నియమించుకోకుండానే ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketFans CricketNews Crime CrimeNews Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews TrendingNow ViralNews WorldNews



















