ఐపీఎల్ 2026లో మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్‌తో కరచాలనం చేయడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా హెడ్ ఆస్ట్రేలియన్ మీడియాతో మాట్లాడారు.
భారత క్రికెట్ అభిమానుల నుంచి ఆన్‌లైన్ వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “వరల్డ్ కప్ విజయం తర్వాత ఎదురైనట్లే ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాను. నేను నిద్ర లేచేసరికి నా సోషల్ మీడియా ఖాతాలు కామెంట్లతో నిండిపోయాయి. నేను బాగానే ఉన్నాను కానీ నా స్నేహితులు, కుటుంబ సభ్యులపై కూడా వేధింపులు జరుగుతున్నాయి” అని ఆమె తెలిపారు.
ఇలాంటి ఆన్‌లైన్ వేధింపులు గతంలోనూ కొనసాగాయని, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా తమ చిన్న కుమార్తెను ఉద్దేశించి కూడా గతంలో ఆందోళన కలిగించే బెదిరింపులు వచ్చాయని ఆమె ఆరోపించారు.
ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని జెస్సికా హెడ్ సూచించారు. “ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ మానసిక ఆరోగ్యం, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం గురించి ముఖ్యమైన చర్చ జరుగుతోంది. భావోద్వేగాలు క్రీడల్లో భాగమే అయినా, ఆట వెనుక నిజమైన వ్యక్తులు, కుటుంబాలు ఉన్నారని గుర్తించాలి. ఒకరిపై ఒకరు దయతో ఉండాలి, మద్దతుగా ఉండాలి” అని ఆమె అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews


















