పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మతం, దేవుడి పేరుతో భాజపా కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, శ్రీరామచంద్రుడు ఆ పార్టీ సొత్తు కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాముడు, హనుమంతుడి పేర్లు జపించడం తప్ప ప్రజలకు ఆ పార్టీ చేసిందేమీ లేదని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని విస్మరించి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను మూసివేస్తూ నిరుద్యోగులను వంచిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ గత పదేళ్లలో విధ్వంసానికి గురైందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించేందుకు భాజపా కుట్ర చేస్తోందని, కాంగ్రెస్ కార్యకర్తలు బూత్‌ల వారీగా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















