పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరల పెంపుపై చెలరేగిన ప్రజా ఆగ్రహానికి తలొగ్గి ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కీలక వెనకడుగు వేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో తొలుత పెట్రోల్‌పై ఏకంగా 137 రూపాయలు పెంచి లీటర్ ధరను 458 రూపాయలకు చేర్చిన ప్రభుత్వం, ఆ నిర్ణయంపై వెల్లువెత్తిన నిరసనలతో కేవలం 24 గంటల్లోనే సవరణ ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని షరీఫ్, పెట్రోల్ ధరపై 80 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 378 రూపాయలకు చేరింది. ఈ తగ్గించిన ధర కనీసం నెల రోజుల పాటు అమలులో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
అయితే డీజిల్ ధర విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి ఉపశమనం కలిగించలేదు. హైస్పీడ్ డీజిల్ (HSD) ధర లీటరుకు 520.35 రూపాయల వద్దే కొనసాగుతోంది. కేవలం పెట్రోల్‌పై మాత్రమే లెవీని తగ్గించడం ద్వారా ఈ ఉపశమనం కల్పించారు. ఇంధన ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యుల కోసం ప్రభుత్వం మరికొన్ని ప్రత్యేక రాయితీలను కూడా ప్రకటించింది. మోటార్ సైకిల్ వినియోగదారులకు లీటరుకు 100 రూపాయల సబ్సిడీని, చిన్న రైతులు మరియు రవాణా రంగం కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి మూతపడటంతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడిందని, అందుకే ఈ క్లిష్ట నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని ప్రధాని వివరించారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మంత్రుల జీతాలను ఆరు నెలల పాటు నిలిపివేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















