ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యకు మరింత ఊతమిస్తూ పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు ఈ విద్యా సంవత్సరంలోనే తరగతుల ప్రారంభానికి జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతులు మంజూరు చేసింది. 100 ఎంబీబీఎస్ సీట్లతో తొలి బ్యాచ్‌ను ప్రారంభించేందుకు అనుమతి లభించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
అలాగే విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు అదనంగా 75 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. పిడుగురాళ్లతో పాటు పాడేరు, కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు లభించిన అనుమతులతో ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రానికి అదనంగా మంజూరైన వైద్య సీట్ల సంఖ్య 325కు చేరిందని చెప్పారు.
పిడుగురాళ్ల వైద్య కళాశాల అనుమతుల విషయంలో గతంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని మంత్రి పేర్కొన్నారు. అయితే కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అధ్యాపకుల నియామకం, వైద్య పరికరాల సమకూర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎన్‌ఎంసీ సూచించిన ప్రమాణాలను పూర్తి చేయడంతో అనుమతులు లభించాయని వివరించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో తొలి బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్యను ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. దీంతో పల్నాడు ప్రాంతానికి చెందిన విద్యార్థులకు స్థానికంగానే వైద్య విద్య అభ్యసించే అవకాశం కలగనుంది.
ఎన్‌ఎంసీ అనుమతులు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రంలోని ఇతర వైద్య కళాశాలల పురోగతిని కూడా ప్రభుత్వం నిరంతరం సమీక్షించిందని మంత్రి చెప్పారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్‌ఎంసీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి, అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు.
వైద్య కళాశాలల సంఖ్య, ఎంబీబీఎస్ సీట్ల పెంపుతో రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. భవిష్యత్‌లో వైద్యుల కొరతను తగ్గించడంతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ విస్తరణలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















