Realme దేశీయ మార్కెట్‌లో కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘రియల్‌మీ 16T’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో భారీ 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.
ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. మీడియాటెక్ డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ డివైస్ Android 16 ఆధారిత Realme UI 7పై రన్ అవుతుంది.ఫోటోగ్రఫీ కోసం 50MP Sony IMX852 ప్రధాన కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ కెమెరాను ఇచ్చారు. AI Portrait Glow, AI Instant Clip వంటి AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.
8000mAh బ్యాటరీకి 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే 6.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా అందించారు.ధర విషయానికి వస్తే.. 6GB+128GB వేరియంట్ ధర రూ.29,999 కాగా, 8GB+128GB వేరియంట్ రూ.31,999, 8GB+256GB వేరియంట్ రూ.34,999గా నిర్ణయించారు. స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌లైట్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మే 27 నుంచి Flipkart మరియు Realme Indiaలో తొలి సేల్ ప్రారంభం కానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















