ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ (Redmi) మరోసారి తన ఫోన్ ధరలను పెంచింది. మెమొరీ చిప్‌ల కొరతతో పాటు విడిభాగాల తయారీ ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
తాజాగా రెడ్‌మీ 15 5G, రెడ్‌మీ నోట్ 15 5G మోడళ్ల ధరలు రూ.2,000 వరకు పెరిగాయి. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. రెడ్‌మీ నోట్ 15 8GB+128GB వేరియంట్ ధర రూ.26,999కి చేరగా, 256GB వేరియంట్ రూ.29,999కి పెరిగింది.
అదే విధంగా రెడ్‌మీ 15 సిరీస్‌లోని అన్ని వేరియంట్ల ధరలు కూడా రూ.2,000 వరకు పెరిగాయి. జనవరిలో విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు కొన్ని మోడళ్లపై రూ.4,000 వరకు పెరుగుదల నమోదు కావడం గమనార్హం.మొబైల్ మార్కెట్‌లో ఇతర బ్రాండ్లపైనా ఇదే ప్రభావం కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















