తమిళనాడు అసెంబ్లీలో బుధవారం ఆసక్తికరమైన, అరుదైన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తనకు కేటాయించిన అధికారిక సీటును వదిలి మంత్రుల మధ్య వెళ్లి కూర్చున్నారు. ఇప్పటివరకు తమిళనాడు అసెంబ్లీలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మంత్రులకు కేటాయించిన స్థానంలో కూర్చోలేదని తెలుస్తోంది.
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా విశాలమైన సీటును కేటాయించారు. ఇది స్పీకర్‌కు సమీపంలో ఉంటుంది. సీఎం సీటు పక్కనే ముందు వరుసలో మంత్రుల కోసం ప్రత్యేక స్థానాలు ఉంటాయి. సీనియారిటీ ఆధారంగా మంత్రులు ఈ వరుసలో కూర్చుంటారు.
బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో విజయ్ తన అధికారిక స్థానాన్ని వదిలి మంత్రుల వరుసలోకి వెళ్లారు. మంత్రులు కేఏ సెంగోట్టియాన్, అధవ్ అర్జున మధ్యలో కూర్చున్నారు.
సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు పరస్పరం మాట్లాడుకోవడానికి తమ స్థానాలను తాత్కాలికంగా మార్చుకోవడం సాధారణమే. మాట్లాడుకున్న తర్వాత తిరిగి తమకు కేటాయించిన స్థానాల్లోకి వెళ్లిపోతుంటారు.
అయితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తనకు కేటాయించిన ప్రత్యేక సీటును వదిలి మంత్రులతో కలిసి కూర్చోవడం మాత్రం ఇప్పటివరకు జరగలేదని సమాచారం. దీంతో ఈ ఘటన అసెంబ్లీలో ప్రత్యేకంగా నిలిచింది.
ముఖ్యమంత్రి అధికారిక సీటు స్పీకర్‌కు అత్యంత సమీపంలో ఉండగా.. మంత్రుల స్థానాలు దానికి పక్కనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో విజయ్ తన సీటును వదిలి మంత్రుల మధ్య కూర్చోవడం అసెంబ్లీలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
సాధారణంగా మంత్రులు తమలో తాము మాట్లాడుకునేందుకు సీట్లు మార్చుకోవడం కనిపించినప్పటికీ.. ఒక ముఖ్యమంత్రి ఇలా చేయడం ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు. దీంతో అసెంబ్లీలో విజయ్ కూర్చున్న తీరు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















