ఇరాన్లో కూలిపోయిన F-15E Strike Eagle పైలట్‌ను రక్షించే ఆపరేషన్ సమయంలో కొంతసేపు టెన్షన్ నెలకొన్నట్లు Donald Trump వెల్లడించారు. రెండో పైలట్ ఫైటర్ జెట్ నుంచి ఎజెక్ట్ అయిన తర్వాత ఇరాన్ దళాల నుంచి తప్పించుకుని పర్వతాల్లో దాక్కొన్నారని తెలిపారు. మొదట, అమెరికా నిఘా విభాగం అతడి లొకేషన్‌ను గుర్తించినప్పటికీ, అతని సిగ్నల్స్ వారిని గందరగోళంలో పడేశాయని ట్రంప్ తెలిపారు.
రేడియో సిగ్నల్స్‌లో “భగవంతుడిదే శక్తి” అని వినిపించిందని, అది ముస్లింలు మాట్లాడుతూ ఉన్నట్లుగా అనిపించిందని పేర్కొన్నారు. తరువాత ఆ సిగ్నల్ “God is Good”గా మిలిటరీ అధికారులు తెలుసుకున్నారు. దీనికి కారణంగా, మొదట అతను ఇరాన్ దళాలకు దొరికిపోయాడని భావించారు, కానీ తర్వాత అతను సజీవంగానే ఉన్నట్టు గుర్తించారు.ట్రంప్ వివరించినట్లుగా, యుద్ధ స్థితి, విపత్కర పరిస్థితుల్లో దళాల సభ్యులు సాంప్రదాయ కోడ్‌ను మరచి సహజసిద్ధంగా స్పందిస్తారు. ఈ పైలట్ కేసులో కూడా అదే జరిగింది. కొంతసేపు టెన్షన్ నెలకొన్నా, తరువాత సిగ్నల్ సరైనదని నిర్ధారించి రక్షణ ఆపరేషన్ చేపట్టారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketNews Crime Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

















