కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. షార్ట్ ఫిలిం చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు పెన్నా నదిలో మునిగి మృతిచెందారు. ఈ ఘటన వల్ల ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై “ఫ్రంట్‌లైన్ ప్రెస్” పేరుతో షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో వారు కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి గ్రామ పరిధిలోని పెన్నా నది వద్ద షూటింగ్ కోసం వెళ్లారు.
అయితే అనుకోని ప్రమాదం చోటుచేసుకుని హరిబాబు (25), హర్షవర్ధన్ (22), కృష్ణచైతన్య (20) నదిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో హరిబాబు, హర్షవర్ధన్ మృతదేహాలు లభించగా, కృష్ణచైతన్య మృతదేహం కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















