జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాగుడు వ్యూహాలు పూర్తిగా మారుతున్నట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. గతంలో గుహలు (Cave Hideouts)ను ఆశ్రయంగా వాడిన ఉగ్ర మూకలు ఇప్పుడు అండర్‌గ్రౌండ్ బంకర్లు, కాంక్రీట్ హైడవుట్స్‌ను వినియోగిస్తున్నాయి.
రాజౌరీ జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిర్వహించిన Operation Sheru Wali సమయంలో భద్రతా బలగాలు ఈ కొత్త తరహా హైడవుట్స్‌ను గుర్తించాయి. మే 22 నుంచి సీఆర్‌పీఎఫ్ మరియు జమ్మూ కశ్మీర్ పోలీసులు కలిసి విస్తృత సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
ఈ ఆపరేషన్‌లో దట్టమైన అడవుల్లో భూమిని తవ్వి దుంగలు, కాంక్రీట్‌తో నిర్మించిన తాత్కాలిక బంకర్లు బయటపడ్డాయి. కొన్ని బంకర్లు ఒకేసారి నలుగురు వరకు ఉండేలా రూపొందించబడి, నెలల తరబడి సరిపడా నిత్యావసరాలు నిల్వ చేసుకునే విధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
చత్రు ప్రాంతంలో 12 వేల అడుగుల ఎత్తులో కూడా ఇలాంటి హైడవుట్ గుర్తించడం భద్రతా బలగాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడ కూడా సకల సౌకర్యాలతో బంకర్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.
గతంలో కుల్గామ్ అడవుల్లో కూడా ఇలాంటి తాత్కాలిక నిర్మాణాలు బయటపడ్డాయి. ఈ మార్పుతో ఉగ్రవాదులు స్థానికులపై ఆధారపడకుండా, ఎక్కువ కాలం అజ్ఞాతంలో ఉండేలా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
ఆపరేషన్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. అనంతరం ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. ప్రస్తుతం రాజౌరీలోని గంబీర్ ముగ్లన్, డొరిమల్ ప్రాంతాల్లో మరిన్ని హైడవుట్స్ ఉన్నాయన్న అనుమానంతో గాలింపు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















