అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 529 పాయింట్లు పడిపోయి 73,576 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 155 పాయింట్లు తగ్గి 22,813 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా క్షీణించింది.
నిఫ్టీ సూచీలో హిందాల్కో, ఓఎన్‌జీసీ, విప్రో, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉండగా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఐషర్ మోటార్స్, ఎంఅండ్‌ఎం వంటి స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు సమీపిస్తుండడంతో యుద్ధ భయం నెలకొంది. ఈ నేపథ్యంలో చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లకు పైగా కొనసాగుతున్నాయి.ఇదే సమయంలో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 93.07కు పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్లోబల్ టెన్షన్స్ ప్రభావంతో మార్కెట్లలో అస్థిరత కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















