పాకిస్థాన్ సైన్యంపై సొంతదేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ఎదురైన ఓటమిని గుర్తుచేస్తూ జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం (ఎఫ్) అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ప్రస్తుత పాక్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు.
పెషావర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఫజ్లుర్ రెహమాన్.. దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సైన్యం ఆర్భాటపు ప్రకటనలు చేయడాన్ని ప్రశ్నించారు. నిరంతర అణచివేత, రక్తపాతం కొనసాగితే భౌగోళిక సరిహద్దుల్లోనూ మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ సందర్భంగా 1971 నాటి పరిణామాలను ఆయన ప్రస్తావించారు. అప్పటి పాక్ సైన్యాధ్యక్షుడు యాహ్యా ఖాన్ యుద్ధ సమయంలో సైనికులను ఉద్దేశించి ధైర్యం నింపేలా వ్యాఖ్యలు చేసినప్పటికీ.. చివరకు పాక్ సైన్యం భారత్ ముందు లొంగిపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
పాక్ సైన్యం అప్పట్లో ఎక్కడైనా శత్రువులతో పోరాడతామని ప్రకటించినప్పటికీ యుద్ధ ఫలితం మాత్రం భిన్నంగా ఉందని ఫజ్లుర్ రెహమాన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సైన్యం మాత్రం విజయోత్సవ ధోరణిలో వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా శక్తి ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని హితవు పలికారు.
1971లో ఏం జరిగింది?
1971లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం దక్షిణాసియా చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. ఈ యుద్ధం అనంతరం తూర్పు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. 13 రోజుల పాటు సాగిన యుద్ధం అనంతరం డిసెంబరు 16, 1971న పాక్ బలగాలు లొంగిపోయాయి.
దాదాపు 93 వేల మంది పాక్ సైనికులు, సిబ్బంది లొంగిపోవడం ఈ యుద్ధంలో కీలక పరిణామంగా నిలిచింది. దీంతో భారత్‌కు చారిత్రక విజయం దక్కగా.. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















