ముంబయి ఇండియన్స్ తరఫున గత మూడు ఐపీఎల్ సీజన్లలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేక తీవ్ర నిరాశ కలిగించిందని సమాచారం. కెప్టెన్‌గా కూడా జట్టును ప్లేఆఫ్స్‌కు రెండుసార్లలో కేవలం ఒక్కసారి మాత్రమే తీసుకెళ్లగలిగాడు. ఆటగాడిగానూ, నాయకుడిగానూ స్థిరమైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌తో ఆయన ప్రయాణం ముగిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లోనూ హార్దిక్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొనడం వంటి అంశాలు ఉన్నప్పటికీ ఐపీఎల్‌లో ఆయనకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. తాజా సమాచారం ప్రకారం ఏకంగా 7 ఐపీఎల్ ఫ్రాంఛైజీలు హార్దిక్ పాండ్యపై ఆసక్తి చూపిస్తున్నాయి.
బెంగళూరు, హైదరాబాద్ జట్లు మాత్రం ఈ రేసులో లేవని తెలుస్తోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ హార్దిక్ కోసం గట్టి పోటీకి సిద్ధమవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కూడా ఆయనను తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది. అంతేకాదు, హార్దిక్ కెప్టెన్సీలో తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కూడా మళ్లీ ఆయనను జట్టులోకి తీసుకునే అవకాశాలను పరిశీలిస్తోంది.
ఇంకా లఖ్‌నవూ, దిల్లీ, పంజాబ్ ఫ్రాంఛైజీలు కూడా ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. వేలానికి ముందు జరిగే ట్రేడ్ విండోలో భాగంగా హార్దిక్ పాండ్య వేరే ఫ్రాంఛైజీకి మారే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















