ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘కమిషన్ కర్మ యోగి’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్‌లైన్ ట్రైనింగ్ (ఐజీఓటీ) ప్లాట్‌ఫాంపై రాష్ట్రం నుంచి కోటి కోర్సులకు నమోదు జరగగా, 80 లక్షల కోర్సులు విజయవంతంగా పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
ఈ ఘనత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యవృద్ధి, నిరంతర శిక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తోంది. ఆధునిక పాలనా విధానాలు అమలు చేస్తూ, ప్రజలకు మరింత సమర్థంగా, పారదర్శకంగా సేవలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
ఐజీఓటీ కర్మ యోగి వేదిక ద్వారా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాలనా నైపుణ్యాలు, ఆర్థిక నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం, ప్రజాసేవ, నాయకత్వం, విధాన రూపకల్పన వంటి కీలక రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. వ్యక్తిగత అభివృద్ధితో పాటు సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
భవిష్యత్తులో మరిన్ని శాఖల వారీగా ప్రత్యేక కోర్సులు, ఆధునిక టెక్నాలజీ ఆధారిత లెర్నింగ్ మాడ్యూళ్లు, అదనపు శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రజా కేంద్రిత పాలన దిశగా ఏపీ చేస్తున్న ప్రయత్నాలకు బలమైన పునాదిగా నిలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















