టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభానికి ముందే వివాదాలు రాజుకుంటున్నాయి. మొన్నటివరకు బంగ్లాదేశ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు పాకిస్థాన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ క్రికెట్‌ను రాజకీయ రంగులోకి లాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో తటస్థ వేదికపై భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయినప్పటికీ ఎటువంటి సరైన కారణం చెప్పకుండా భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ పాకిస్థాన్ చేసిన ప్రకటనలు విమర్శలకు దారి తీశాయి.
ఈ వ్యవహారంపై పలువురు భారత మాజీ క్రికెటర్లు ఘాటుగా స్పందించారు.
హర్భజన్ సింగ్
పాకిస్థాన్‌పై ఐసీసీ తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హర్భజన్ సింగ్ అన్నారు. నిషేధం, జరిమానాలు విధించడమే కాకుండా, భవిష్యత్తులో ఐసీసీ టోర్నమెంట్లకు ఆతిథ్యం కోల్పోయే పరిస్థితి రావొచ్చని హెచ్చరించారు.
మదన్‌లాల్
“పాకిస్థాన్ తనకు తానే నష్టం చేసుకుంటోంది. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. అక్కడ ఎవరో ఒకరు సరైన నిర్ణయం తీసుకునేలా ఆలోచించాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
రవిచంద్రన్ అశ్విన్
“నాకౌట్ దశలోనూ భారత్–పాక్ మ్యాచ్ జరగదా? అలా అయితే భారత్‌కు అది వరల్డ్ టీ20 బైలాగా మారుతుందా?” అంటూ అశ్విన్ ప్రశ్నించారు.
ఈ పరిణామాలతో టీ20 వరల్డ్‌కప్‌కు ముందే రాజకీయ ప్రభావాలు, వివాదాలు టోర్నీపై నీడ వేసే పరిస్థితి కనిపిస్తోంది.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Geopolitics governance Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow



















