ఇంటర్నెట్ డెస్క్ – కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు సహజ నటనకు మారుపేరైన సాయి పల్లవి జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. 2018లో విడుదలైన ‘మారి 2’ చిత్రంలో ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు మరోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతోంది.
‘అమరన్’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఓ కొత్త సినిమా ఇటీవల ప్రకటించబడింది. ధనుష్ కెరీర్‌లో ఇది 55వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ‘డీ 55’ (D55) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే హీరోయిన్‌గా శ్రీలీల ఎంపిక కాగా, తాజాగా మరో కథానాయికగా సాయి పల్లవి ఎంపికైనట్లు అధికారికంగా వెల్లడించారు.
ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇందులో ధనుష్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని చిత్ర బృందం తెలిపింది. కథ, కథనం పరంగా ఇది ధనుష్ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
‘అమరన్’ చిత్రంలోనూ సాయి పల్లవే హీరోయిన్ కావడం గమనార్హం. అటు దర్శకుడు, ఇటు హీరోతో కలిసి ‘డీ55’ సాయి పల్లవికి రెండో సినిమా కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘మారి 2’లోని పాటలో ధనుష్–సాయి పల్లవి చేసిన డ్యాన్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంది.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి త్వరలో ‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. మరోవైపు, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుండగా, రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.
ఈ అన్ని ప్రాజెక్టులతో సాయి పల్లవి కెరీర్ మరింత ఎత్తులకు చేరుతుండగా, ధనుష్–సాయి పల్లవి కాంబినేషన్ మరోసారి తెరపై మ్యాజిక్ చేయనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















