ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు శుభవార్త లభించింది. ఏపీ మీదుగా నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో స్టాపింగ్‌లు మంజూరయ్యాయి. దీంతో పాటు త్వరలోనే వందేభారత్ రైలు కూడా బాపట్ల, చీరాలలో ఆగనుందని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ వెల్లడించారు.ప్రస్తుతం తిరువనంతపురం–చర్లపల్లి, రాధికాపూర్–ఎస్‌ఎంవీటీ బెంగళూరు మార్గాల్లో నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బాపట్ల స్టేషన్‌లో ఆగనున్నాయి. ఈ రైళ్లు హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
బాపట్ల జిల్లా మీదుగా మొత్తం నాలుగు అమృత్ భారత్ రైళ్లు నడుస్తుండగా, వాటిలో రెండు బాపట్లో, మరో రెండు చీరాలలో ఆగుతున్నట్లు ఎంపీ తెలిపారు. అంతేకాదు, నరసాపురం–చెన్నై మధ్య నడిచే వందేభారత్ రైలుకు కూడా బాపట్ల, చీరాలలో హాల్ట్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేశానని తెలిపారు. దీనిపై సానుకూల నిర్ణయం త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరువనంతపురం–చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలులో స్లీపర్, జనరల్, ప్యాంట్రీ కార్‌తో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక బోగీలు ఉన్నాయి. అలాగే రాధికాపూర్–బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు బాపట్లలో స్టాపింగ్ ఇవ్వడంతో బెంగళూరు, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.ఇక సత్రాగచ్చి–తాంబరం, అలిపూర్‌ద్వార్–బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా చీరాల స్టేషన్‌లో ఆగనున్నాయి. ఈ స్టాపింగ్‌లతో బాపట్ల, చీరాల ప్రాంత ప్రజలకు రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















