పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనంతో పాటు స్వచ్ఛమైన పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచి, వినియోగదారులకు తమకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. E20 ఇంధన ధరలను కూడా తగ్గించాలని కోరారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. E20 వల్ల వాహనాలకు ఎలాంటి నష్టం ఉండదని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన అధ్యయన నివేదికలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ప్రజలపై E20 ఇంధనాన్ని ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించేందుకు ఆగస్టు 4న ఆయన నివాసం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















