ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సు ఈ మధ్య కాలంలో అరుదైన అతిథులతో కళకళలాడుతోంది. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాలు, ఉప్పునీటి కయ్యల్లో కనిపించే గ్రేటర్ ఫ్లెమింగోలు (రాజహంసలు) ఈసారి వేల సంఖ్యలో కొల్లేరుకు వలస వచ్చాయి. రెండేళ్ల క్రితం వరకు పదుల సంఖ్యలోనే కనిపించిన ఈ పక్షులు, ప్రస్తుతం గుంపులుగా వచ్చి స్థానికులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

సుమారు 4.5 అడుగుల ఎత్తు, 2–4 కిలోల బరువు కలిగిన ఈ పక్షులు గులాబీ రంగు ఛాతీ, కాళ్లు, ముక్కుతో, తెల్లటి శరీరంతో కనువిందు చేస్తాయి. మెడ వంపు తిరిగి ఉండటం, ముక్కు చివర నల్లటి మచ్చ, పసుపు రంగు కళ్లు వీటి ప్రత్యేకత. నీటిలో నడుస్తూ, గుంపులుగా కదులుతూ చేసే నృత్య విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.ఫ్లెమింగోలు ప్రధానంగా రొయ్యలు, నత్తలు, విత్తనాలను ఆహారంగా తీసుకుంటాయి. ముక్కును సుమారు 20 సెకన్లపాటు నీటిలో ఉంచి ఆహారం గ్రహించి, తర్వాత నీటిని ముక్కు రంధ్రాల ద్వారా వదిలేస్తాయి. సీజన్‌కు ఒక్క గుడ్డు మాత్రమే పెట్టడం వీటి ప్రత్యేకత. గుడ్డు నుంచి బయటకు వచ్చే పిల్ల మొదట నలుపు రంగులో ఉండి, కొద్ది రోజుల్లో గోధుమ, బూడిద రంగులుగా మారి చివరికి తెల్లగా మారుతుంది.
రాత్రి వేళల్లో 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే ఈ పక్షులు, పగటి వేళ నీటిలో సేద తీరుతాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే సరికి ఇవి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణ యూరప్, అమెరికా ఖండాల్లో వీటి ఉనికి ఎక్కువగా ఉంటుంది. భారత్‌లో ప్రధానంగా గుజరాత్ ప్రాంతంలో ఇవి గుంపులుగా నివసిస్తాయి.ప్రస్తుతం కొల్లేరు ప్రాంతానికి వెయ్యి నుంచి వెయ్యిన్నర వరకు ఫ్లెమింగోలు వచ్చాయని అటవీ శాఖ డీఎఫ్‌వో విజయ్ తెలిపారు. ఈ అరుదైన పక్షుల రాకతో కొల్లేరు సరస్సు మరోసారి పక్షి ప్రేమికుల కేంద్రంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















