తెలంగాణ అసెంబ్లీలో మూడో రోజు ప్రారంభమైన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్ సభ్యులు ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. పలువురు సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అడ్డంకిగా మారుతున్న సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. మంత్రి సిఫారసు మేరకు కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ సభ్యులను సభా సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్, హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, ప్రశాంత్‌రెడ్డి, మర్రిరాజశేఖర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, విజయుడు, జగదీశ్‌రెడ్డి, అనిల్ జాదవ్, సుధీర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, సునీత లక్ష్మారెడ్డి ఉన్నారు.
సస్పెన్షన్ అనంతరం స్పీకర్‌ను కలిసేందుకు బీఆర్‌ఎస్ సభ్యులు ప్రయత్నించగా.. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
మరోవైపు బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభాపతిని అవమానించే విధానాన్ని విపక్ష నేతలు మానుకోవాలని సూచించారు. సభాపతి సూచనలు పాటిస్తూ సభ సజావుగా జరిగేలా సహకరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దళితుల నిరసనకు సంబంధించిన ఘటనను ప్రస్తావిస్తూ.. ప్రజలను అవమానించే విధానాలను ప్రభుత్వం సహించదని అన్నారు. ‘దొరతనం పోకడలను భరించడానికి రాష్ట్రం సిద్ధంగా లేదు’ అంటూ బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















