మేఘాలయలో జరిగిన ‘హనీమూన్ హత్య’ కేసును తలపించేలా మరో దారుణ ఘటన **Rajasthan**లో వెలుగుచూసింది. పెళ్లైన మూడు నెలలకే భర్తను హత్య చేయించిందో యువతి. వాకింగ్‌కు వెళ్దామని తీసుకెళ్లి, ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయించి చంపించిన ఘటన రాజస్థాన్‌లోని Sri Ganganagar జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీగంగానగర్‌కు చెందిన ఆశిష్‌కు మూడు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన అంజూతో వివాహమైంది. అయితే వివాహం జరిగిన కొద్ది రోజులకే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో అంజూ పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారమవడంతో మళ్లీ అత్తింటికి చేరుకుంది.జనవరి 30 రాత్రి 9 గంటల సమయంలో ఆశిష్, అంజూ ఇద్దరూ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆశిష్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో అంజూ తొలుత.. గుర్తుతెలియని వాహనం తమను ఢీకొట్టిందని, ఆ తర్వాత కొందరు వ్యక్తులు దిగి తనను బెదిరించి నగలు దోచుకెళ్లినట్లు తెలిపింది. అయితే ఆమె వాంగ్మూలానికి, సంఘటన స్థలంలోని పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. అంతేకాదు, అంజూకు ఎలాంటి గాయాలు లేకపోవడం, ఆశిష్ శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో పోలీసులు ఆమెను గట్టిగా ప్రశ్నించారు.
దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అంజూ పెళ్లికి ముందే తన ఇంటి సమీపంలో నివసించే సంజూని ప్రేమించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వివాహం తర్వాత కూడా అతడితో ఫోన్‌లో నిరంతరం సంబంధం కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియుడిని కలిసిన అంజూ, భర్తను హత్య చేయాలనే కుట్ర పన్నినట్లు గుర్తించారు.
ఘటన జరిగిన రాత్రి ఆశిష్‌ను వాకింగ్‌కు తీసుకెళ్లిన అంజూ, ముందుగానే నిర్మానుష్య రహదారిపై మాటువేసిన సంజూ, అతని స్నేహితులతో కలిసి భర్తపై దాడి చేయించిందని పోలీసులు వెల్లడించారు. దాడిలో ఆశిష్ ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అంజూ ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.ఈ కేసులో అంజూతో పాటు ఆమె ప్రియుడు సంజూ, అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















