చెక్ బౌన్స్ కేసులో రజనీకాంత్ నటించిన ‘కొచ్చడైయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా నిర్మాతకు సంబంధించి మద్రాసు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరుకు చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2.5 కోట్లు నాలుగు వారాల్లో చెల్లించాలని, లేదంటే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.ఈ కేసు 2014లో విడుదలైన 3డీ మోషన్ క్యాప్చర్ చిత్రం ‘కొచ్చడైయాన్’ నిర్మాణ వ్యయాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించగా, ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. దీపికా పదుకొణే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
సినిమా నిర్మాణానికి రుణం
నిర్మాణ అవసరాల కోసం మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరైన మురళీ మనోహర్, బెంగళూరుకు చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రుణం తీసుకున్నారు. రుణం తిరిగి చెల్లించే క్రమంలో 2014లో యాడ్ బ్యూరో మేనేజింగ్ డైరెక్టర్ అబిర్ చంద్ నహర్‌కు రూ.5 కోట్ల చెక్ ఇచ్చారు.
చెక్ బౌన్స్… కోర్టు కేసు
అయితే ఆ చెక్ బౌన్స్ కావడంతో అబిర్ చంద్ నహర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు, మురళీ మనోహర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన మద్రాసు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
హైకోర్టు తాజా తీర్పు
ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ట్రయల్ కోర్టు విధించిన జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ, బాధిత సంస్థ అయిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2.5 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల గడువు ఇచ్చినట్లు పేర్కొంది. గడువు లోపు మొత్తం చెల్లించకపోతే మళ్లీ జైలు శిక్ష అమలులోకి వస్తుందని హెచ్చరించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















