సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా వచ్చిన వీడియో చూసి ఆ ప్రాంతాన్ని చూడాలన్న ఉత్సాహంతో వెళ్లిన ఓ బాలుడు క్వారీ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మదనపల్లె మండలంలో సోమవారం వెలుగు చూసింది.
అప్పారావుతోటకు చెందిన మహమ్మద్ ఆనస్ (14) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో సాయంత్రం స్నేహితులతో కలిసి బసినికొండ పంచాయతీ పరిధిలోని ఓ క్వారీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ లోతైన గుంతల్లో నీరు నిండివుండటాన్ని గమనించకుండా నీటిలోకి దిగిన ఆనస్ అకస్మాత్తుగా గల్లంతయ్యాడు.స్నేహితులు అతన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని రాత్రి వరకు గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు.
సోమవారం ఉదయం సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి శివప్ప ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. సుమారు 50 అడుగుల లోతులో రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఆనస్ మృతదేహాన్ని వెలికితీశారు.ఆడుతూ పాడుతూ ఉండే కుమారుడు ఇలా అకారణంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఈ క్వారీ ప్రాంతం గురించి వీడియో పోస్టు చేయడంతో, దాన్ని చూసేందుకు వెళ్లినట్టు ఆనస్ స్నేహితులు తెలిపారు.
ఈ ఘటనపై గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదకర ప్రాంతాలపై పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో కనిపించే వీడియోల పట్ల జాగ్రత్త అవసరమని పోలీసులు హెచ్చరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















