ఉత్తర్‌ప్రదేశ్‌లోని Kanpurలో సంచలనం సృష్టించిన లంబోర్గిని కారు ప్రమాద కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ పొగాకు వ్యాపారవేత్త కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.
వీఐపీ రోడ్‌పై ఆదివారం మధ్యాహ్నం వేగంగా వచ్చిన లగ్జరీ Lamborghini కారు అదుపుతప్పి పాదచారులు, వాహనాలపైకి దూసుకెళ్లింది. ముందుగా ఓ ఆటోను ఢీకొట్టి, ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రాథమిక విచారణలో కారు నడిపింది శివం మిశ్రానే అని పోలీసులు నిర్ధారించారు. గురువారం ఉదయం అతడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.కేసులో నాటకీయ మలుపు
బుధవారం ఈ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మోహన్ అనే వ్యక్తి కాన్పూర్ కోర్టుకు వెళ్లి, ప్రమాద సమయంలో కారు తానే నడిపానని లొంగిపోవడానికి ప్రయత్నించాడు. శివం మూర్ఛపోవడంతో తానే కారు నియంత్రించానని తెలిపాడు. ప్రమాదం అనంతరం ఆటో లాకింగ్ సిస్టమ్ కారణంగా బయటకు రాలేకపోయానని, తర్వాత శివంను డ్రైవర్ సీటులోకి మార్చినట్లు వివరించాడు.అయితే, ప్రమాద సమయంలో కారు నడిపింది శివమే అని వీడియో ఆధారాలతో పోలీసులు కోర్టుకు వివరించారు. ఘటన అనంతరం శివంను డ్రైవర్ సీటు నుంచి బయటకు తీసిన దృశ్యాలు బయటపడినట్లు తెలిపారు.
పోలీసుల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం మోహన్ లొంగిపోవడాన్ని తిరస్కరించింది. ఈ అంశంపై పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. వేగ నియంత్రణ లోపం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా జరిగిన ఈ ప్రమాదం లగ్జరీ కార్ల వినియోగంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















