ఇరాన్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు భారత ప్రభుత్వం అత్యవసర సూచనలు జారీ చేసింది. పరిస్థితులు వేగంగా మారుతున్నందున తక్షణమే ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని సూచించింది.ఇరాన్‌లో ఉన్న భారతీయులు—విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు—అందుబాటులో ఉన్న కమర్షియల్ విమానాలు లేదా ఇతర ప్రయాణ మార్గాల ద్వారా వెంటనే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని, ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. తాజా పరిణామాలపై స్థానిక మీడియాను గమనిస్తూ, అవసరమైతే ఎంబసీతో సంప్రదింపులు జరపాలని తెలిపింది.
ఈ సూచనలను Indian Embassy in Iran విడుదల చేసింది. జనవరి 5న జారీ చేసిన మార్గదర్శకాల కొనసాగింపుగా ఈ తాజా అడ్వైజరీని ప్రకటించినట్లు తెలిపింది.ఇరాన్–అమెరికా మధ్య అణు చర్చలు ఇంకా కొలిక్కిరాకపోవడం, ఉద్రిక్తతలు పెరుగుతున్ననేపథ్యంలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. చర్చలు విఫలమైతే ఇరాన్‌పై దాడి చేసే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు Donald Trump సూచించినట్లు సమాచారం. ఇప్పటికే అమెరికా పశ్చిమాసియాలో విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలను మోహరించింది.
ఇక టెహ్రాన్ సహా పలు ప్రాంతాల్లో విద్యార్థుల నిరసనలు మళ్లీ చెలరేగాయి. పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.ఇరాన్‌లో తొలి దశ అల్లర్లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికాకు చెందిన ఒక మానవ హక్కుల సంస్థ వెల్లడించినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















