ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ చిత్రం విడుదలకు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా కేరళ హైకోర్టు మధ్యంతర స్టే విధించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2023లో తీవ్ర వివాదాల నడుమ విడుదలైన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాతే ఈ సినిమా మళ్లీ రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారి తీసింది. సినిమాలో కేరళ రాష్ట్రాన్ని ప్రతికూలంగా చూపిస్తూ, మతపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యే అంశాలు ఉన్నాయంటూ పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కేరళ హైకోర్టు, సెన్సార్ బోర్డు జారీ చేసిన ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. సినిమా పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే సర్టిఫికెట్ ఇచ్చారా? అంటూ ప్రశ్నించింది. కోర్టులో ప్రత్యేకంగా ప్రదర్శించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. హైకోర్టు అభిప్రాయం ప్రకారం, రాష్ట్ర పేరును టైటిల్‌లో ఉపయోగించడం వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవని స్పష్టం చేసినప్పటికీ, ఈ కేసులో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపింది.

ఇక రాజకీయ వర్గాల్లో కూడా ఈ చిత్రంపై చర్చ నడుస్తోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించగా, దర్శకుడు అనురాగ్ కశ్యప్ దీన్ని ప్రోపగాండా సినిమాగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడు కామాఖ్యా నారాయణ్ సింగ్, నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా మాత్రం తమ సినిమా ఎవరినీ లక్ష్యంగా చేసుకుని తీసిందికాదని, వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించామని చెబుతున్నారు. వివాదాల కంటే సినిమా కంటెంట్ చూసి తీర్పు ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రస్తుతం ‘కేరళ స్టోరీ 2’ విడుదల తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వాయిదా పడింది. సెన్సార్ పునఃపరిశీలన అనంతరం సినిమా భవిష్యత్‌పై స్పష్టత రానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















