మహిళల భద్రత మరియు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకువస్తోందని సీఎం పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలని లక్ష్యంతోనే మహిళాశక్తి పథకం ప్రారంభించామని చెప్పారు. మహిళల సామర్థ్యంపై ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని, వారి ప్రతిభను గుర్తించి పార్టీలో కీలక పదవులు కూడా ఇస్తున్నామని తెలిపారు.అలాగే ఆర్టీసీ రంగంలో మహిళలకు అవకాశాలు కల్పిస్తూ వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తమ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారని అన్నారు.
ఇటీవల సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధించే ఘటనలు పెరుగుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, సినీ నటుడు సాయి దుర్గ తేజ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















