భౌతికశాస్త్రంలో ధ్వని ఒక ముఖ్యమైన శక్తి రూపం. ధ్వని వల్ల మనకు వినికిడి జ్ఞానం కలుగుతుంది. ఇది ప్రధానంగా తరంగాల రూపంలో ప్రయాణించే యాంత్రిక శక్తి. ధ్వని ఉత్పత్తి, ప్రసారం, వినికిడి అన్నీ కూడా కంపనాలపై ఆధారపడి ఉంటాయి. పదార్థ కణాలు తమ సమతుల్య స్థానానికి ఇరువైపులా అతి సూక్ష్మంగా కదలడం వల్ల కంపనాలు ఏర్పడి, అవి ధ్వని తరంగాలుగా ప్రయాణిస్తాయి.
తరంగాలు – ప్రధాన రకాలు
భౌతికశాస్త్రంలో తరంగాలను ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు.
- యాంత్రిక తరంగాలు – ఇవి ఒక మాధ్యమం ద్వారా మాత్రమే ప్రయాణిస్తాయి. ఉదాహరణకు ధ్వని తరంగాలు.
- విద్యుదయస్కాంత తరంగాలు – ఇవి మాధ్యమం లేకుండానే ప్రయాణిస్తాయి. ఉదాహరణకు కాంతి తరంగాలు.
- ద్రవ్య తరంగాలు – పదార్థ కణాలకు సంబంధించిన తరంగాలుగా పరిగణిస్తారు.
తరంగాల ముఖ్య లక్షణాలు
తరంగాల అధ్యయనంలో కొన్ని ముఖ్యమైన భౌతిక పరిమాణాలు ఉంటాయి. అవి:
- కంపన పరిమితి
- తరంగ పౌనఃపున్యం
- తరంగ వేగం
- తరంగదైర్ఘ్యం
ఈ పరిమాణాల ఆధారంగా ధ్వని యొక్క లక్షణాలను అర్థం చేసుకోవచ్చు.
ధ్వని – శబ్దం మధ్య తేడా
మనకు వినడానికి ఇంపుగా అనిపించే శబ్దాన్ని ధ్వని అంటారు. వినడానికి ఇబ్బందిగా, అసహ్యంగా అనిపించే శబ్దాన్ని శబ్దం అంటారు. మన చెవిలోని కర్ణభేరి (కంపించటం వల్లనే మనం ధ్వని లేదా శబ్దాన్ని గుర్తించగలుగుతాం.
భవన ధ్వనిశాస్త్రం
రికార్డింగ్ స్టూడియోలు, ఆడిటోరియంలు, సినిమా హాళ్లు వంటి పెద్ద భవనాల్లో ధ్వని సరైన విధంగా వినిపించేందుకు ప్రత్యేక శాస్త్రీయ విధానాలు ఉపయోగిస్తారు. ధ్వని ఉత్పత్తి, వ్యాప్తి, ప్రతిధ్వని, గ్రాహ్యత వంటి
అంశాలను అధ్యయనం చేసే భౌతికశాస్త్ర విభాగాన్ని భవన ధ్వనిశాస్త్రం అంటారు.
ధ్వనికి సంబంధించిన ఇతర అంశాలు
భౌతికశాస్త్రంలో ధ్వనికి సంబంధించిన మరిన్ని ముఖ్య అంశాలు కూడా ఉన్నాయి. వాటిలో
- తిర్యక్ తరంగాలు
- అనుదైర్ఘ్య తరంగాలు
- అతిధ్వనులు
- అనునాదం
- స్వరం లక్షణాలు
- ధ్వని తీవ్రత
- ధ్వని వేగం
- మాక్ సంఖ్య
- సంగీత వాయిద్యాల్లో ధ్వని ఉత్పత్తి
వంటి అంశాలు ముఖ్యమైనవి.
.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















