పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉద్యోగాలు లేని యువతకు నెలకు రూ.1500 నిరుద్యోగ భృతి అందించనున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని నేటి నుంచే అర్హులైన యువత ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు.
‘యువ సాథి’ (Yuva Sathi) పేరుతో అమలు చేయనున్న ఈ పథకం 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగ యువతకు వర్తిస్తుందని చెప్పారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా వారు స్వయం సమృద్ధిగల భవిష్యత్తు వైపు ముందుకు సాగుతారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పథకాన్ని మొదటగా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగానే ప్రారంభించాలని నిర్ణయించినట్లు మమతా బెనర్జీ తెలిపారు. కోల్‌కతాలో నిర్వహించిన ఓ ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
తమ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు సుమారు 40 శాతం తగ్గిందని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించిందని, వారిలో 10 లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు.అదే విధంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికే ఏటా రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ఐటీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని, తద్వారా భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయని మమతా బెనర్జీ వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















