దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) తీర్చిదిద్దాలంటే మహిళల ఆర్థిక భాగస్వామ్యం కీలకమని యాక్సిస్ బ్యాంక్ విడుదల చేసిన ‘ది మిస్సింగ్ హాఫ్: వుమెన్ అండ్ ఇండియాస్ గ్రోత్ ఛాలెంజ్’ నివేదిక వెల్లడించింది. భారత్ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలంటే మహిళలు వేతనంతో కూడిన ఉద్యోగాల్లో మరింతగా పాల్గొనాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలో మొత్తం ఉద్యోగాల్లో 47 శాతం మంది మాత్రమే వేతనంతో కూడిన పనుల్లో ఉన్నారని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ సంఖ్యను 60 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మహిళల శ్రామిక శక్తి పెరగడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద బలం అవుతుందని విశ్లేషించింది.
జీ-20 దేశాలతో పోలిస్తే మహిళల ఉద్యోగాల్లో భాగస్వామ్యం విషయంలో భారత్ ఇంకా వెనుకబడి ఉందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం పనిచేస్తున్న మహిళల్లో 61 శాతం మంది తక్కువ ఉత్పాదకత కలిగిన వ్యవసాయ రంగంలోనే కొనసాగుతున్నారు. అలాగే వేతనం పొందుతున్న మహిళల్లో సుమారు 60 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తూ సామాజిక భద్రత లేకుండా జీవనం సాగిస్తున్నారని పేర్కొంది.
ఇంకా, దేశంలో 12.5 కోట్లకు పైగా విద్యావంతులైన మహిళలు ఉద్యోగాలకు దూరంగా ఉన్నారు. వీరిలో సుమారు 60 శాతం మంది డిగ్రీలు పూర్తి చేసిన వారేనని నివేదిక తెలిపింది. వివాహం తర్వాత లేదా పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగాలను వదిలివేయడం కూడా మహిళల ఉపాధి తగ్గడానికి ఒక ముఖ్య కారణమని పేర్కొంది.
మహిళలు ఉద్యోగాల్లోకి రావడంలో భద్రతా సమస్యలు, ప్రయాణ సౌకర్యాల లోపం, కుటుంబ బాధ్యతలు ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 61 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని మార్చాలంటే మహిళలకు ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్, కెరీర్ బ్రేక్ తర్వాత తిరిగి ఉద్యోగాల్లో చేరే అవకాశాలు కల్పించాలని నివేదిక సూచించింది. అలాగే రాత్రి విధులు, ఫ్యాక్టరీ పనులపై ఉన్న పాత చట్టపరమైన ఆంక్షలను పూర్తిగా తొలగించి మహిళల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















