మీరు బీఎస్సీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ యూనివర్సిటీ లేదా కళాశాలలో చదువుతున్నారో స్పష్టంగా చెప్పలేదు. అది వ్యవసాయ బీఎస్సీలో ఒక స్పెషలైజేషన్‌గా చేస్తున్నారా? లేక సాధారణ డిగ్రీలో ఒక కోర్సుగా చదువుతున్నారా? అలాగే మీ డిగ్రీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ICAR) గుర్తింపు ఉందా లేదా అన్నది కూడా తెలుసుకోవడం అవసరం. ఈ అంశాలు కెరియర్ అవకాశాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇటీవలి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణ, రసాయన రహిత వ్యవసాయం పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఈ కారణంగా సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన పట్టభద్రులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వ రంగంలో రాష్ట్ర వ్యవసాయ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వ్యవసాయ అధికారి, వ్యవసాయ అభివృద్ధి అధికారి, విస్తరణ అధికారి, నేల సంరక్షణ అధికారి వంటి ఉద్యోగాలు లభిస్తాయి. వీరి ప్రధాన బాధ్యత రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ వ్యవసాయ పథకాలను అమలు చేయడం, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించే కార్యక్రమాలు నిర్వహించడం. కృషి విజ్ఞాన కేంద్రాలు (KVK) రైతులకు శిక్షణ ఇచ్చి సేంద్రియ సాగును ప్రోత్సహిస్తాయి.
ప్రైవేట్ రంగంలో సేంద్రియ వ్యవసాయ క్షేత్రాల్లో ఫార్మ్ మేనేజర్, ఫార్మ్ సూపర్‌వైజర్, ప్రొడక్షన్ మేనేజర్ వంటి ఉద్యోగాలు చేయవచ్చు. వ్యవసాయ సలహాదారులుగా లేదా ఎన్జీవోలలో పనిచేస్తూ రైతులకు సేంద్రియ సాగు పద్ధతులపై అవగాహన కల్పించవచ్చు.సేంద్రియ ఉత్పత్తుల సర్టిఫికేషన్ రంగంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. సర్టిఫికేషన్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఇన్‌స్పెక్టర్, క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. విత్తనాలు, బయో ఎరువులు, బయో పెస్టిసైడ్ సంస్థలు, సేంద్రియ ఆహార బ్రాండ్లు వంటి ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు లభిస్తాయి.
అలాగే సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్, సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్, ఎగుమతులు వంటి రంగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నవారు సొంత ఆర్గానిక్ ఫార్మ్, వర్మీ కంపోస్టింగ్ యూనిట్, బయో ఎరువుల తయారీ యూనిట్ ప్రారంభించవచ్చు. నగర వినియోగదారులకు నేరుగా ఉత్పత్తులు అందించే ఫార్మ్-టు-టేబుల్ సేవలు ప్రారంభించే అవకాశమూ ఉంది.
ఇక పరిశోధన రంగంలో ICAR సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేయవచ్చు. నాబార్డ్, ప్రభుత్వ రంగ బ్యాంకులు వంటి సంస్థల్లో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేసే అవకాశమూ ఉంటుంది. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వంటి సంస్థల్లో ఆహార భద్రత, నాణ్యత నియంత్రణకు సంబంధించిన ఉద్యోగాలు కూడా పొందవచ్చు.మొత్తానికి, సేంద్రియ వ్యవసాయం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందబోయే రంగం. ఇందులో నైపుణ్యం పెంచుకుంటే ఉద్యోగం మాత్రమే కాదు… స్వయం ఉపాధి ద్వారా కూడా మంచి కెరియర్ నిర్మించుకోవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















