సైనిక దళాల్లో క్వాంటం టెక్నాలజీ వినియోగం
భారత రక్షణ వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు మిలటరీ క్వాంటం మిషన్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేశారు. ఈ ఫ్రేమ్‌వర్క్‌ను అనిల్ చౌహాన్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) విడుదల చేశారు. క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం సెన్సింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను సైన్యంలో ఉపయోగించే విధానాలను ఇందులో వివరించారు. భవిష్యత్ యుద్ధ వ్యూహాల్లో ఆధునిక టెక్నాలజీ కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఈ పాలసీకి ప్రాధాన్యం పెరిగింది. దీని ద్వారా భారత రక్షణ దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తుచేసేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం స్థాపించబడిన సందర్భాన్ని గుర్తుగా 2011 నుంచి ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 2026లో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ ఓటర్లను నమోదు చేసుకునేలా ప్రోత్సహించడం, ఓటు హక్కు విలువపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టారు.
భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు
భారతదేశంలో తొలి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం యూఏఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సమావేశాల సందర్భంగా దావోస్‌లో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు యూఏఈ ఆర్థిక, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణానికి అనుకూలంగా, అత్యాధునిక సదుపాయాలతో కూడిన స్మార్ట్ సిటీని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భవిష్యత్ నగరాల రూపకల్పనకు మార్గదర్శకంగా నిలవనుంది.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















