నటుడు అల్లు శిరీష్ తన ప్రేమ కథను తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా పంచుకున్నారు. తన ప్రియురాలు నయనిక రెడ్డితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడిన ఆయన, పెళ్లికి ముందే ఇద్దరూ భవిష్యత్తు గురించి చాలాసార్లు చర్చించుకున్నామని చెప్పారు.
శిరీష్ మాట్లాడుతూ, “మేం ప్రేమలో ఉన్న సమయంలో ఎక్కువగా పెళ్లి గురించే మాట్లాడుకునేవాళ్లం. మాకు పుట్టే పిల్లలు ఇంట్లో తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలి అన్నది నా కోరిక. ఆ విషయం గురించి కూడా మేమిద్దరం ముందే చర్చించుకున్నాం” అని తెలిపారు.
నయనిక వ్యక్తిత్వం గురించి చెబుతూ, ఆమెకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని, ఏ విషయం నచ్చకపోతే ముక్కుసూటిగా చెప్పే స్వభావం తనకు చాలా ఇష్టమని అన్నారు. అలాగే ఆమెకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా, తన పని గురించి బాగా అర్థం చేసుకుంటుందని శిరీష్ చెప్పారు. తన సినిమాల్లో నచ్చిన విషయాలను ఆమెతో పంచుకుంటూ ఉంటానని పేర్కొన్నారు.
డేటింగ్ రోజుల గురించి గుర్తుచేసుకుంటూ, ఒకసారి ఇద్దరూ కాఫీ షాప్‌కు వెళ్లినప్పుడు వారి ప్రేమ విషయం ఇంట్లో బయటపడిందని చెప్పారు. ఆ విషయం చిరంజీవి గారి భార్య సురేఖకు తెలిసినట్లు తెలిపారు. మమ్మల్ని చూసిన వాళ్లు ఫోన్ చేసి చెప్పడంతో ఇంట్లో అందరికీ విషయం తెలిసిందని చెప్పారు.
దాంతో తానే ముందుగా ఇంట్లో నయనికపై ఉన్న ప్రేమను వెల్లడించానని, కుటుంబ సభ్యులు అంగీకరించడంతో తమ వివాహానికి మార్గం సుగమమైందని చెప్పారు. “నయనికను ఆమె తండ్రి ఎలా ప్రేమగా చూసుకున్నాడో, నేను కూడా అలాగే చూసుకోవాలనుకుంటున్నాను” అని శిరీష్ భావోద్వేగంగా చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















