ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘గోటీల ఫ్యాక్టరీ’ వార్తపై ప్రముఖ నటుడు రాజశేఖర్ స్పష్టత ఇచ్చారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్‌లో గోటీలు (గోలీలు) అమ్ముతూ సంవత్సరానికి రూ.3 నుంచి రూ.4 కోట్లు సంపాదిస్తున్నారనే వీడియో కొంతకాలంగా యూట్యూబ్ సహా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రాజశేఖర్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ విషయంపై స్పందించిన ఆయన నవ్వుతూ, “ఇదేమిటమ్మా మాయ మాయ… ఒక పక్క గోటీల ఫ్యాక్టరీ, మరో పక్క వీడియోలు. నాకు అలాంటి వ్యాపారం ఏదీ లేదు. ఆ వీడియో చూసి నా స్నేహితులే ఫోన్ చేసి నిజమేనా అని అడిగారు. నేనూ ఆశ్చర్యపోయాను… ‘నాకు ఫ్యాక్టరీ ఎక్కడుంది? నేను ఎక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నాను?’ అనిపించింది” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
సినిమాల్లో తనను ఇమిటేట్ చేసే అంశంపైనా రాజశేఖర్ స్పందించారు. మొదట్లో తనను అనుకరిస్తే ఆశ్చర్యపోయేవాడినని, కానీ తర్వాత అది సరదాగా అనిపించేదని చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనను, వెంకటేశ్ను బాగా ఇమిటేట్ చేస్తారని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు తాను చేసిన కొన్ని డ్యాన్స్ స్టెప్పులు కూడా తనకే గుర్తు లేకపోయినా, ఇతరులు స్టేజ్‌పై అనుకరిస్తే నవ్వుకుంటానని తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజశేఖర్, శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘బైకర్’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకోసం తాను, శర్వానంద్ ఇద్దరూ చాలా కష్టపడ్డామని, ఆ కష్టం తెరపై కనిపిస్తుందని రాజశేఖర్ తెలిపారు. తన పాత్రకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పిన తర్వాత బాగుంటే తప్పకుండా ఫోన్ చేసి అభినందిస్తారని, లేదంటే మౌనంగా వెళ్లిపోతారని కూడా ఆయన ఆసక్తికరంగా వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















