నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) 2026లో 72 ట్రెయినీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి BE / B.Tech లేదా B.Sc (ఇంజినీరింగ్) అభ్యర్థులు అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పొందే శాఖలు సివిల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ & హైవోల్టేజ్, పవర్ ఇంజినీరింగ్, మెకానికల్, ప్రొడక్షన్, థర్మల్, మెకానికల్ & ఆటోమేషన్. జనరల్ అభ్యర్థులు 60% మార్కులు, SC/ST మరియు దివ్యాంగులు 50% మార్కులతో డిగ్రీ పూర్తి చేసుకోవాలి.
అభ్యర్థుల గరిష్ట వయసు 30 సంవత్సరాలు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల, OBC-NCL అభ్యర్థులకు 3 సంవత్సరాల, మరియు దివ్యాంగులకు 10–15 సంవత్సరాల సడలింపు ఉంది.ఎంపిక ప్రక్రియలో GATE 2024/2025 స్కోరు 75% వెయిటేజ్, గ్రూప్ డిస్కషన్ 5% వెయిటేజ్, పర్సనల్ ఇంటర్వ్యూ 20% వెయిటేజ్ కలిగి ఉంటుంది. OBC-NCL అభ్యర్థులు GD/PIలో కనీస 40% మార్కులు, SC/ST/దివ్యాంగులు కనీస 30% మార్కులు పొందాలి. GATE స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి తదుపరి దశకు ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులను ఎన్‌హెచ్‌పీసీ ప్రాజెక్టులు, పవర్ స్టేషన్లు, ఆఫీసులు లేదా అనుబంధ సంస్థల్లో నియమించే అవకాశం ఉంది. నియామక సమయంలో మొదటి ఏడాది probation period ఉంటుంది.దరఖాస్తు ఫీజు ₹708 మాత్రమే. SC/ST, మహిళలు, దివ్యాంగులు మరియు మాజీ సైనికోద్యోగులు ఫీజు రద్దు. వేతన శ్రేణి నెలకు ₹50,000–1,60,000. దీనికి అదనంగా DA, HRA, మరియు ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 06.04.2026.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















