ఈ కొత్త రకమైన సైబర్ నేరంలో నేరస్తులు మీ ధనాన్ని నేరుగా దొంగిలించరు. వారు మీ డిజిటల్ గుర్తింపును (Digital Identity) దొంగిలిస్తారు. దీనివల్ల మీరు ఊహించని విధంగా భారీ అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.నేరస్తులు మీలోని ‘మంచితనాన్ని’ ఆసరాగా చేసుకుంటారు.
నమ్మకమైన వేషధారణ: సూట్లు వేసుకున్న మధ్య వయస్కులు లేదా చాలా సాధువులుగా కనిపించే వృద్ధులు మీ దగ్గరకు వస్తారు.
సహాయం కోరడం: “నాకు ఫోన్ వాడటం రాదు, నా పెన్షన్ స్టేటస్ చూడండి” లేదా “మా అబ్బాయికి కాల్ చేయడం రావడం లేదు, కొంచెం చేసి పెడతారా?” అని ప్రాధేయపడతారు.
టెక్నాలజీ మాయాజాలం: మీరు వారి ఫోన్ పట్టుకోగానే, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్స్ మీ ముఖాన్ని స్కాన్ చేస్తాయి, మీ మాటలను రికార్డ్ చేస్తాయి. కొన్నిసార్లు ఫోన్ స్క్రీన్ పైన మీ వేలిముద్రలు పడేలా ప్లాన్ చేస్తారు.మీ వాయిస్, ఫేస్ డేటా దొరికితే AI సహాయంతో ‘డీప్‌ఫేక్’ (Deepfake) వీడియోలు లేదా వాయిస్ క్లోన్స్‌ను సృష్టిస్తారు.
ఇన్‌స్టంట్ లోన్స్: ప్రస్తుతం చాలా బ్యాంకులు, లోన్ యాప్స్ కేవలం ఫేస్ వెరిఫికేషన్ మరియు వాయిస్ కన్ఫర్మేషన్ ద్వారా నిమిషాల్లో లోన్ ఇస్తున్నాయి. మీ డేటాను వాడి వారు లక్షల రూపాయల లోన్ తీసుకుంటారు.
క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్: మీ పేరు మీద కొత్త క్రెడిట్ కార్డులు పొంది షాపింగ్ చేస్తారు.
బ్లాక్ మెయిలింగ్: మీ ముఖాన్ని అశ్లీల వీడియోలకు జోడించి మిమ్మల్ని భయపెట్టే అవకాశం కూడా ఉంది.
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి:
ముక్కుమొహం తెలియని వారి ఫోన్లు తాకకండి: ఎవరైనా సహాయం అడిగితే, వారు చెప్పే నంబర్ టైప్ చేసి ఫోన్ స్పీకర్‌లో పెట్టి మాట్లాడమనండి కానీ, ఫోన్ మీ చేతుల్లోకి తీసుకోవద్దు.
కెమెరా యాక్సెస్: తెలియని వ్యక్తుల ఫోన్ చూస్తున్నప్పుడు కెమెరా లెన్స్ వైపు చూడకండి.
వాయిస్ మెసేజ్లు: సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులకు మీ వాయిస్ నోట్స్ (Voice Notes) పంపకండి.
టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA): మీ బ్యాంకింగ్ మరియు సోషల్ మీడియా ఖాతాలకు తప్పనిసరిగా 2FA ఆన్ చేసుకోండి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNews TrendingNow ViralNews WorldNews



















