మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సీఎంకు వివరించారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందులో 13 మంది మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని జగిత్యాల నుంచి బయలుదేరిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ ప్రాథమిక విచారణలో స్టీరింగ్ అకస్మాత్తుగా పనిచేయకపోవడం (స్టక్ కావడం) కారణమై ఉండొచ్చని తెలిపినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే ప్రమాదానికి గల అసలు కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సూచించారు.ఇదే ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రయాణికుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల అధికారులు పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















