హైదరాబాద్ జవహర్‌నగర్‌లో హృదయాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమాయణానికి అడ్డుగా ఉందని భావించిన ఓ యువతి, తన ప్రియుడితో కలిసి కన్నతల్లినే హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన సంఘటన సంవత్సరం తర్వాత బయటపడింది.
ఝార్ఖండ్‌కు చెందిన అంజు (45) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి జవహర్‌నగర్ పరిధిలో నివసిస్తోంది. భర్త ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత, ఇళ్లల్లో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో చిన్న కుమార్తెకు డ్రైవర్ మోంటీ కుమార్‌సింగ్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఈ సంబంధాన్ని అంజు వ్యతిరేకించడంతో, ఇద్దరు కక్ష పెంచుకుని గతేడాది మే 12న దారుణానికి పాల్పడ్డారు. కత్తితో పలుమార్లు పొడిచి అంజును హతమార్చి, శవాన్ని ఇంట్లోనే మంచం కింద దాచిపెట్టారు. తర్వాత మరుసటి రోజు అదే గదిలో పాతిపెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా సిమెంట్ వేశారు.
తల్లి బయటకు వెళ్లిపోయిందని పెద్ద కుమార్తెను నమ్మించారు. కాలక్రమంలో అదృశ్య కేసు కూడా నమోదైంది. అయితే ఇటీవల డబ్బు అవసరం రావడంతో, దాచిన ద్విచక్రవాహనాన్ని విక్రయించే ప్రయత్నం చేశారు. వాహనం అంజు పేరుమీద ఉండటం, దానిపై కేసు నమోదై ఉండటంతో కొనుగోలుదారు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
దీనితో పోలీసులు విచారణ చేపట్టి, మోంటీని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. హత్యకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బాలికను స్టేట్ హోంకు పంపించగా, మోంటీని జైలుకు తరలించారు.
ప్రేమ పేరిట జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

















