దివంగత ఆస్ట్రేలియా లెజెండ్ Shane Warne ముందుచూపుతో పెట్టిన పెట్టుబడి ఇప్పుడు అతని కుటుంబానికి భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. Rajasthan Royals ఫ్రాంఛైజీ అమ్మకాలతో వార్న్‌కు ఉన్న 3% వాటా విలువ దాదాపు రూ.460 కోట్లకు చేరింది.
ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008)లో రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్న వార్న్, తన కాంట్రాక్ట్‌లో ప్రత్యేక నిబంధన పెట్టించాడు. జట్టుకు ఆడిన ప్రతి సీజన్‌కు 0.75% వాటా ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. నాలుగేళ్ల పాటు కెప్టెన్, మెంటార్‌గా కొనసాగడంతో మొత్తం 3% వాటా పొందాడు. ఇప్పుడు అదే పెట్టుబడి అతని కుటుంబానికి భారీ ఆర్థిక లాభాన్ని అందించనుంది.
ఇక Board of Control for Cricket in India కూడా ఈ డీల్‌తో భారీగా లాభపడనుంది. నిబంధనల ప్రకారం ఫ్రాంఛైజీ అమ్మకాలపై 5% ఫీజు బీసీసీఐకి దక్కుతుంది. రాజస్థాన్ రాయల్స్‌తో పాటు Royal Challengers Bengaluru అమ్మకాల ద్వారా బోర్డుకు దాదాపు రూ.1600 కోట్లు వచ్చే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026 తర్వాత ఈ డీల్స్‌కు తుది ఆమోదం లభించనుంది. మొత్తంగా వార్న్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అతని కుటుంబానికి మాత్రమే కాకుండా ఐపీఎల్, బీసీసీఐకు కూడా పెద్ద ఫైనాన్షియల్ బూస్ట్‌గా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















