టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ వచ్చే ఏడాది ఫిబ్రవరితో తన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను మరోసారి నియమించాలని కోరబోనని ప్రకటించిన ఆయన.. ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యే వరకు బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్‌ను ముందుండి నడిపించిన ఆయనకు అందుతున్న పారితోషికం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖరన్ మొత్తం రూ.158.6 కోట్ల పారితోషికం అందుకున్నారు. ఆయన కెరీర్‌లో ఒకే ఆర్థిక సంవత్సరంలో అందుకున్న అత్యధిక పారితోషికం ఇదే. ఇందులో జీతం, ఇతర ప్రయోజనాల కింద రూ.17.9 కోట్లు లభించగా.. లాభాలకు అనుసంధానమైన కమిషన్ రూపంలో ఏకంగా రూ.140.69 కోట్లు అందుకున్నారు.
అంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.155.81 కోట్లు పారితోషికంగా అందుకున్నారు. 2021-22 నుంచి 2025-26 వరకు ఐదేళ్ల కాలంలో చంద్రశేఖరన్ మొత్తం సుమారు రూ.685 కోట్లను అందుకున్నారు. ఈ కాలంలో ఆయనకు లభించిన మొత్తం పారితోషికంలో కమిషన్ వాటానే గణనీయంగా ఉంది.
ఐదేళ్లలో కమిషన్ :
- 2021-22: రూ.94 కోట్లు
- 2022-23: రూ.100 కో ట్లు
- 2023-24: రూ.121.5 కోట్లు
- 2024-25: రూ.140.69 కోట్లు
- 2025-26: రూ.140.69 కోట్లు
కార్పొరేట్ రంగంలో అత్యధిక పారితోషికం పొందుతున్న అగ్రశ్రేణి సీఈవోలలో చంద్రశేఖరన్ ఉన్నప్పటికీ.. 2025-26లో ఆయన కంటే ఎక్కువ మొత్తం అందుకున్న వ్యక్తి హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ సి. విజయ్‌కుమార్. ఆయనకు ఆ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.176 కోట్ల పారితోషికం లభించింది.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో టాటా సన్స్ బోర్డు డైరెక్టర్లకు చెల్లించిన మొత్తం పారితోషికంలో చంద్రశేఖరన్‌కు అందిన మొత్తం దాదాపు 80 శాతానికి సమానం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















