ఎనిమిదేళ్లుగా ప్రేమించిన యువకుడికి మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చంద్రగిరి మండలం అరిగెలవారిపల్లెకు చెందిన షాలిని(21), పనపాకం గ్రామానికి చెందిన ఎస్.చందు ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో షాలినిని బెంగళూరుకు పంపించారు. అయినప్పటికీ చందు అక్కడికి వెళ్లి ఆమెను కలుస్తూ ఉండేవాడని సమాచారం.
షాలిని మైనర్‌గా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చేసేందుకు ప్రయత్నించగా.. చందు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించి ఆ వివాహాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం కూడా వీరి మధ్య ప్రేమ కొనసాగింది.
అయితే ఇటీవల చందు కుటుంబ సభ్యులు అతనికి మరో యువతితో వివాహం నిశ్చయించారు. వారం రోజుల్లోనే చందు పెళ్లి జరగనుందని తెలుసుకున్న షాలిని తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. అంతకుముందు ఆమె చివరిసారిగా చందుతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.
ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం షాలిని మృతదేహాన్ని స్వగ్రామమైన అరిగెలవారిపల్లెకు తరలించారు. విషయం తెలుసుకున్న చందు ప్రస్తుతం అందుబాటులో లేడని, అతడి కోసం పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















