పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా విఘాతం ఏర్పడుతోంది. ఈ పరిణామంలో ఆసియా వ్యాప్తంగా దాదాపు 50 ద్రవీకృత సహజ గ్యాస్ (LNG) ట్యాంకర్లు ఖాళీగా నిలిచినట్లు సమాచారం. హర్మూజ్ జలసంధిని మూసివేయడం, ఖతార్‌లో ఎగుమతులు ఆగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది, అని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఖతార్ – గ్యాస్ హబ్ రస్లఫాన్
ఖతార్‌లోని రస్ లఫాన్ (Ras Laffan) నగరం ప్రపంచ గ్యాస్ వాణిజ్యంలో కీలక కేంద్రంగా ఉంది. దాదాపు 20 ఏళ్లలో ఈ ప్రదేశం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ పరిశ్రమకు హబ్‌గా ఎదిగింది. గత నెలలో ఇరాన్ దాడి కారణంగా ఇక్కడి గ్యాస్ ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా ఆసియా నుండి ఖతార్‌కు వెళ్లి గ్యాస్ నింపి తిరిగి తీసుకురావలసిన ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల వల్ల ఖాళీగా నిలిచాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఖాళీ LNG ట్యాంకర్లు
పశ్చిమ భారత్, శ్రీలంక తీరాలు, మలక్కా జలసంధి, సింగపూర్ తూర్పు సమీప జలాల్లో కూడా ఖాళీ LNG ట్యాంకర్ల సమాచారం బ్లూమ్‌బెర్గ్ నివేదికలు వెల్లడించాయి. డేటా ప్రకారం ఏ ఒక్క ట్యాంకర్‌లోనూ LNG లేదు. దీనివల్ల ప్రపంచదేశాలు నేచురల్ గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎగుమతిదారుల సమాచారం ప్రకారం ప్రపంచంలో దాదాపు 800 LNG ట్యాంకర్లు ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















