రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా వాసిరెడ్డి ప్రభునాథ్ విజయం సాధించారు. ఆయనకు 832 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి జీవీఎస్ కిశోర్‌కుమార్ 807 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రభునాథ్‌కు తెదేపా, జనసేన లీగల్ సెల్‌తో పాటు అఖిల భారత న్యాయవాదుల సంఘం (AILU), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (IAL) మద్దతు లభించగా, కిశోర్‌కుమార్‌కు వైకాపా మద్దతు ఇచ్చింది.
ఇతర పదవుల్లో ఉపాధ్యక్షుడిగా పీటా రామన్, ప్రధాన కార్యదర్శిగా తిరుమలశెట్టి కిరణ్, సంయుక్త కార్యదర్శిగా వల్లభనేని శాంతిశ్రీ, గ్రంథాలయ కార్యదర్శిగా పుష్పలీల ఆకుమర్తి, కోశాధికారిగా ఎంఎస్‌వీఎస్ సుధారాణి, క్రీడలు & సాంస్కృతిక కార్యదర్శిగా యడ్లూరి రత్నం, మహిళా ప్రతినిధిగా కె. అనూరాధ ఎన్నికయ్యారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సంభాన శశికళ, గంగిశెట్టి రాజేశ్వరరావు, దేవదీపక్ అనిరుధ్ యాదవ్, వైవీకే చక్రవర్తి, రుద్ర మల్లికార్జునరావు ఎన్నికయ్యారు. మహిళా సభ్యులుగా పుప్పాల లక్ష్మి, జనరల్ (వుమెన్)గా బొట్టా అరుణ గెలుపొందారు.శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ఈ ఎన్నికలు నిర్వహించగా, ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది ఎం. విజయ్‌కుమార్ వ్యవహరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews
















